Nitya Pooja

                              రుద్రునికి  అభిషేక  ద్రవ్యఫలములు

ఆవుపాలతో అభిషేకించిన                   –          సర్వ సౌఖ్యములు

ఆవు పెరుగుతో                                 –          ఆరోగ్యం, బలము, సర్వ సౌఖ్యములు

కొబ్బరి నీళ్ళతో                                 –           సర్వసంపదలు

ఆవునెయ్యితో                                   –           ఐశ్వర్యవృద్ధి

మెత్తని పంచదారతో                           –           దుఃఖ నాశనము

తేనెతో                                              –           తేజోవృద్ధి

భస్మ జలముతో                                –           మహాపాపహారము

గంధోదకముతో                                  –           పుత్ర లాభము

పుష్పోదకముతో                               –            భూ లాభము

బిల్వజలముతో                                 –            భోగ భాగ్యములు

దుర్వోదకముతో                                –            నష్టద్రవ్య ప్రాప్తి

నువ్వుల నూనెతో                             –            అపమృత్యుహారము

రుద్రాక్షోదకముతో                              –            మహా ఐశ్వర్యము

సువర్ణ జలముతో                             –             దరిద్ర్య నాశనము

అన్నంతో                                        –              రాజ్య ప్రాప్తి, ఆయుర్వుద్ధి, సుఖ జీవనము

చెరుకు రసంతో                                 –             ధనవృద్ధి

ద్రాక్షరసంతో                                     –             సకల కార్య సిద్ధి

కర్జూర ఫలముతో                             –             శత్రువులకు హాని

నేరేడు పండు రసంతో                       –              వైరాగ్యం

కస్తూరి జలంతో                               –              చక్రవర్తిత్వం

నవరత్న జలముతో                         –              ధ్యానం, గృహ, గో ప్రాప్తి

మామిడి పండ్ల రసంతో                     –              దీర్ఘవ్యాధి నాశనం

పసుపు నీళ్ళతో                               –             మంగళ ప్రదం

తిలమిశ్రమం ఆవుపాలతో                 –             శనిగ్రహ పీడా నివారణ

చెక్కెర మిళిత ఆవుపాలతో               –              వాక్శుద్ధి, జడబుద్ధి నివారణ

దక్షిణా వృత శంఖముతో                  –              గృహకల్లోల  నివారణ

పన్నీరుతో                                     –              పుత్ర లాభం

ఆయా  ద్రవ్యములతో  శివునికి  అభిషేకించిన  ఆయా  ఫలములు  లభించునని  మహర్షులచే  చెప్పబడెను.

 

——————————————————————————————————–

వినాయకచవితి నాడు   పూజించే   పత్రాలు-  వాటిలోని   ఔషధ గుణాలు

 

  1. మాచీ పత్రం మాచీ పత్రం అనేది  తెలుగు  పేరు.  చేమంతి  జాతికి  చెందిన  దీని  ఆకులు  సువాసనాభరితంగా వుంటాయి.  చేమంతి  ఆకుల  మాదిరిగా  వుంటాయి.

ఇది దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు, తగ్గించటానికి ఉపయోగపడుతుంది.

 

  1. బృహతీ పత్రందీనిని ములక అంటారు. దీనిలో  చిన్న ములక, పెద్ద ములక  అని  రెండు  రకాలున్నాయి.  పత్రాలు వంగ  ఆకుల  మాదిరి  తెల్లని  చారలుండే  గుండ్రని  పండ్లతో  వుంటాయి.

ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్తి, మూత్ర వ్యాధులను నేత్ర వ్యాధులను నయం చేయటానికి దంత ధావనానికి ఉపయోగపడుతుంది.

 

  1. బిల్వ పత్రంబిల్వ పత్రం అంటే  మారేడు  ఆకు. మూడు ఆకులు  కలిసి  ఒక  ఆకుగా వుంటాయి. ఇవి  శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీ దేవికి  కూడా  ఇష్టమైనదిగా  చెపుతారు.

ఇది  జిగట  విరోచనాలు,  మధు మేహం , కామెర్లు, నేత్ర వ్యాధులు,  శరీర దుర్గంధం,  తగ్గించటానికి వుపయోగపడుతుంది. 

 

  1. దూర్వారపత్రందూర్వార పత్రం అంటే  గరిక.  తెల్ల గరిక,  నల్ల గరిక  అని ఎండు రకాలు ఉంటాయి.  గడ్డి జాతి మొక్కలు  విఘ్నేశ్వరునికి  అత్యంత  ప్రీతిపాత్రమైనవి.

ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, అర్ధమొలలు  నివారణకు  ఉపయోగపడుతుంది.

 

  1. దత్తూర పత్రం – దీనిని ఉమ్మెత్త అంటారు. ఇది వంకాయ జాతికి చెందినది. ముళ్ళతో కాయలు, వంకాయ  రంగు పూలు వుంటాయి.

ఇది శెగ గడ్దలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోస వ్యాధులు, ఋతు వ్యాధుల నివారణకు  వుపయోగపడును. ఇది  విషపూరితమైనది  కనుక  జాగ్రత్తగా  వాడవలెను.

 

  1. బదరీ పత్రం బదరీ పత్రం అంటే  రేగు. దీనిలో  రేగు , జిట్రేగు, గంగ రేగు  అని  మూడు రకాలు వుంటాయి.

ఇది జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు, రోగ నిరోధక శక్తి పెంపుదలకు వుపయోగపడుతుంది.

 

  1. అపామార్గ పత్రంతెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుంటుంది.

ఇది దంతధావనానికి,  పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారటం, అర్ధ మొలలు,  ఆనెలు, గడ్డలు,  అతి ఆకలి,  జ్వరం,  మూత్ర పిండాలలో  రాళ్ళు  తగ్గించటానికి  వుపయోగపడుతుంది.

 

  1. తులసీ పత్రంహిందువులకి తులసి  గురించి  ప్రత్యేకంగా  చెప్పనవసరం లేదు. దేవతార్చనలో  వాడతారు.

ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవి పోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గించటానికి వుపయోగపడుతుంది.   వ్యాధి  నిరోధక శక్తిని  పెంపొందిస్తుంది.

 

  1. చూత పత్రంచూత పత్రం అంటే  మామిడి ఆకు. ఈ ఆకులకు  శుభ కార్యాలలో  విశిష్ట స్థానం వుంది. మామిడి తోరణం లేని  హైందవ  గృహం  పండుగ రోజులలో  కనిపించదు.

ఇది  రక్త విరోచనాలు,  చర్మ వ్యాధులు,  ఇంటిలోని  క్రిమి కీటకాలు  నివారణకు  వుపయోగపడతాయి.

 

  1. కరవీర పత్రం దీనిని గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకి విశిష్ట స్థానం వుంది.

ఇది  కణతులు, తేలు కాటు, విష కీటకాల కాట్లు, దురద,  కళ్ల సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు తగ్గించటానికి వుపయోగపడుతుంది.   

  1. విష్ణు క్రాంత పత్రం ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే దానిని విష్ణు క్రాంతమంటారు.

ఇది జ్వరం,  కఫం,  పడిశం,  దగ్గు,  ఉబ్బసం, తగ్గించటానికి  జ్ఞాపక శక్తి  పెంపొందించటానికి  వుపయోగపడుతుంది.

 

  1. దాడిమీ పత్రం దాడిమీ అంటే దానిమ్మ. శక్తి  స్వరూపిణి  అమ్మకి  దాడిమీ  ఫల  నైవేద్యం  ఎంతో ఇష్టం.

ఇది విరోచనాలు,  అతిసారం, దగ్గు, కామెర్లు, అర్ధమొలలు, ముక్కు నుండి రక్తం కారటం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు  తగ్గించటనికి  వుపయోగపడుతుంది.

 

  1. దేవదారు పత్రం – దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు.ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన  విగ్రహాలకు  సహజత్వం  వుంటుంది.

ఇది అజీర్తి,  పొట్ట సంబంధ  వ్యాధులు,  చర్మ వ్యాధులు,  కంటి  సంబంధ  వ్యాధులు  తగ్గించటానికి  వుపయోగపడుతుంది.

 

  1. మరువక పత్రందీనిని వాడుక భాషలో మరువం, దవనం  అంటారు. ఎండినా  మంచి  సువాసన  వెదజల్లుతుండటం  ఈ  పత్రం ప్రత్యేకం.

ఇది జీర్ణ శక్తి, ఆకలి పెంపొందించటం, జుట్టు రాలటం, చర్మ వ్యాధులు తగ్గించటానికి వుపయోగపడుతుంది. దీనిని సువాసనకి  వుపయోగిస్తారు.

 

  1. సింధువార పత్రందీనిని వాడుక భాషలో వావిలి అని  కూడా  పిలుస్తారు.

ఇది జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, గాయాలు, చెవిపోటు, చర్మ వ్యాధులు, మూర్చవ్యాధి ప్రసవం తరువాత వచ్చే ఇబ్బందులను  తగ్గించటానికి  వుపయోగిస్తారు.

 

  1. జాజీ పత్రంఇది సన్నజాజి అనే మల్లెజాతి  మొక్క. వీటి  పువ్వుల  నుండి  సుగంధ తైలం  తీస్తారు.

ఇది వాత నొప్పులకు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటి పూత , దుర్వాసన,  కామెర్లు, చర్మ వ్యాధులు తగ్గించటానికి  వుపయోగపడుతుంది.

 

  1. గండకీ పత్రందీనినే లతా దూర్వా అంటారు. భూమి పైన  తీగ  మాదిరి  పాకి కణుపులలో గడ్డి మాదిరి పెరుగుతుంది.

ఇది మూర్చ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు, నులిపురుగుల నివారణకు,వుపయోగపడుతుంది. వీని ఆకులు ఆహారంగా  కూడా  వుపయోగిస్తారు.

 

  1. శమీ పత్రంజమ్మి చెట్టు  ఆకులనే  శమీ పత్రం  అంటారు.  దసరా రోజులలో  ఈ  చెట్టుకి  ప్రత్యేక  పూజలు చేస్తారు

ఇది కఫం,  మూల వ్యాధి,  కుష్టు వ్యాధి,  అతిసారం,  దంత వ్యాధులు,  నివారించటానికి  వుపయోగపడుతుంది.

 

  1. అశ్వత్థ పత్రంరావి ఆకులనే అశ్వత్థ పత్రమంటారు.  రావి  చెట్టుకి  పూజలు  చేయటం  మన  సంప్రదాయం.

ఇది  చర్మ వ్యాధులు,  కీళ్ళ నొప్పులు,  మలాశయ దోషాలు,  గుండె జబ్బుల  నివారణకి  వుపయోగపడుతుంది.

 

  1. అర్జున పత్రంమద్ది చెట్టు ఆకులనే అర్జున పత్రం  అంటారు.  ఇవి  మర్రి  ఆకులని  పోలి వుంటాయి. అడవులలో పెరిగే  పెద్ద  వృక్షం  ఇది.

ఇది  చర్మ  వ్యాధులు,  కీళ్ళ నొప్పులు, మలాశయ  దోషాలు , గుండె  జబ్బుల  నివారణకు  వుపయోగపడుతుంది.

 

  1. అర్క పత్రం జిల్లేడు ఆకులని  అర్క పత్రం  అంటారు. తెల్ల జిల్లేడు వేరుతో  వినాయక ప్రతిమని  పూజించటం వల్ల విశేష ఫలితం వుంటుందని చెపుతారు.

ఇది  చర్మ వ్యాధులు, శెగ గడ్డలు, కీళ్ళ  నొప్పులు,  చెవి పోటు, కోరింత దగ్గు, విరోచనాలు, తిమ్మిర్లు, బోదకాలు, వ్రణములు  తగ్గించటానికి వుపయోగపడుతుంది. 

——————————————————————————————————–

తిధులకు అధిపతులు

 

పాడ్యమి                         –                     అగ్నిదేవుడు

విదియ                          –                      బ్రహ్మ

తదియ                          –                      పార్వతి

చవితి                            –                      విఘ్నేశ్వరుడు

పంచమి                         –                     ఆదిశేషుడు

షష్టి                               –                     కుమార స్వామి

సప్తమి                           –                     సూర్యుడు

అష్టమి                           –                     శివుడు, దుర్గ

నవమి                           –                     అష్టవసువులు

దశమి                           –                     దిగ్గజాలు

ఏకాదశి                         –                      యముడు

ద్వాదశి                         –                     విష్ణువు

త్రయోదశి                      –                     మన్మధుడు

చతుర్దశి                        –                     శివుడు

పౌర్ణమి                         –                      చంద్రుడు

అమావాస్య                   –                      పితృదేవతలు 

——————————————————————————————————-

                     సప్త ఋషులు

 

  1. వశిష్ఠ మహర్షి

      సీతారామ  కళ్యాణ బ్రహ్మ

  1. గౌతమ మహర్షి

     రుక్మిణీ  కళ్యాణ బ్రహ్మ

  1. జమదగ్ని మహర్షి

      శ్రీ  వేంకటేశ్వర  కళ్యాణ బ్రహ్మ

  1. అత్రి మహర్షి

    రాధ  కళ్యాణ బ్రహ్మ

  1. భరద్వాజ మహర్షి

     పార్వతి  కళ్యాణ బ్రహ్మ

  1. కశ్యప మహర్షి

    శ్రీ  సుబ్రహ్మణ్య  కళ్యాణ బ్రహ్మ

  1. విశ్వామిత్ర మహర్షి

      శ్రీ  హనుమత్  కళ్యాణ బ్రహ్మ

——————————————————————————————————–

గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు, దుష్టస్థానములలో ఉన్నప్పుడు ,మనశ్శాంతి కరువైనప్పుడు, గ్రహశాంతి చేయించుకోవటం అవసరం

 

గ్రహము                    వారము                     చేయవలసిన దానము

 

రవి                          ఆదివారం                     గోధుమలు

చంద్రుడు                 సోమవారం                   బియ్యం

కుజుడు                   మంగళవారం               కందులు

బుధుడు                 బుధవారం                    పెసలు

గురుడు                  గురువారం                   శెనగలు

శుక్రుడు                  శుక్రవారం                   బొబ్బర్లు

శని                         శనివారం                     నల్లనువ్వులు

రాహువు                శనివారం                    మినుములు

కేతువు                మంగళవారం                  ఉలవలు

——————————————————————————————————–